Venkatesh1

Apr 19 2024, 07:25

స్థానికుడిని అందుబాటులో ఉంటా... ఆదరించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

స్థానికుడిని అందుబాటులో ఉంటా... ఆదరించండి..

ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం

◆ సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.

◆ ఓట్ల కోసం టీడీపీ అబద్ధపు నెరవేర్చని హామీలు

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఒకసారి అవకాశం ఇవ్వండని ఎం. వీరాంజనేయులు ప్రజలను కోరారు.

నార్పల మండలం గడ్డంనాగేపల్లి, వెంకటాంపల్లి, మద్దలపల్లి, నాయనపల్లి, నడిమిదొడ్డి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సైపుల్లా బేగ్ లతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

అడుగడుగునా గ్రామాల్లో ఆత్మీయంగా హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి అవ్వా తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న ఐదేళ్ల పాలన చేసిన సంక్షేమాన్ని ఆయా కుటుంబాలకు వివరించారు. స్థానికుడిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటా.. మంచి చేస్తా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం అపద్దపు హామీలతో వస్తున్నారన్నారు. 2014లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే టిడిపి హయంలో ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాసేవారన్నారు. 2019 లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేర్చారన్నారు. ఇంటింటికి సంక్షేమాన్ని అందించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జగనన్న మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో టిడిపి వాళ్లు చేస్తున్న ప్రచారంలో ప్రజలు కరువయ్యారన్నారు. జగనన్నపై విమర్శలు తప్ప ప్రజలకు ఏం చేస్తామో టీడీపీ గట్టిగా చెప్పలేకపోతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడును ఓడించి ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 18 2024, 07:39

ఇండియా వేదిక ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి..

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఇండియా వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు సురేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ నల్లప్ప సిపిఎం నాయకులు నాగేంద్ర,రఫీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

రేపు నార్పల మండల కేంద్రంలో గాంధీ సర్కిల్ నందు సాయంత్రం నాలుగు గంటలకి ఇండియా వేదిక ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ శైలజనాథ్ ను గెలిపించాలని కోరుతూ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్, సిపిఐ నాయకులు పాల్గొంటారు.

రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీలు బిజెపికి తొత్తులుగా పనిచేస్తున్నాయి. రాష్ట్రానికి ద్రోహం చేసి నాటకాలు ఆడుతున్న బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని పరోక్షంగా మద్దతు ఇస్తూ వైసిపి రాజధాని ఎక్కడో తెలియని స్థితిలోకి నెట్టింది. సింగనమల నియోజకవర్గం లో అవినీతి అక్రమాలు బాగా పెరిగాయని 2014 ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన అనేక పనులు, సంక్షేమ పథకాలను ఇప్పటికీ అమలులోకి నోచుకోలేదు. గార్లదిన్నె ఐదవ డిస్ట్రిబ్యూటరీ కాలువ ఆధునికరణ పనులు, సింగనమల నియోజకవర్గంలోని రాచేపల్లి లెదర్ పార్కును మూసివేసి ఏళ్లు గడుస్తున్నా పునరుద్ధరణ చేయలేదు, నార్పల లో డిగ్రీ కళాశాల, పుట్లూరులో జూనియర్ కళాశాల ప్రారంభించలేదు. ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి. పాలక పార్టీలు వ్యక్తిగత దూషణలు తప్ప ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడం మానేశాయి. ఈ పరిస్థితులలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజాతంత్ర హక్కుల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇండియా వేదిక రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర కలిసి వచ్చే పార్టీలతో అవగాహన చేసుకుని ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. సింగనమల నియోజకవర్గం నుండి మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించాలని కోరుతూ రేపు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Venkatesh1

Apr 18 2024, 07:43

ఉమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల బండారి శ్రావణి శ్రీ, అంబికా లక్ష్మీనారాయణ గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన.. ఆలం నరసా నాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కూరగానిపల్లి గ్రామo లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు

గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు.ఈ కార్యక్రమం లో టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. 

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని, జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అని మెగా డీఎస్సీ విడుదల చేస్తానని కళ్ళబోల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నాడే తప్ప చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువత గురించి ఒక్క సారి కూడా ఆలోచించలేదని అందుకే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ది చెప్పి తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనాలో రాష్ట్రం ముందుకు వెళ్లకుండా అభివృద్ధిలో వెనక్కు వెళ్లిందని కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పి అభివృద్ధి, పాలనను గాలికి వదిలేశారని, ఒక్క ఛాన్స్ అని నమ్మి ఓట్లేసిన ప్రజలకు గుదిబండలాగా తయారైందని

అందుకే ముందు చూపు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకోవాలని అప్పుడే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పాలన ముందుకు సాగి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 18 2024, 07:06

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక..

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక..

శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామంలో టీడీపీ నుంచి వైసీపీ పార్టీ లోకి పాలకుల జయరాం అనే కుటుంబం చేరారు.

ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పార్టీలోకి ఆహ్వానించి కండువా వేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని చూసి ఆకర్షితులై, రానున్న ఎన్నికలలో మరింత అభివృద్ధి చేస్తారని నమ్మకంతో వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

Venkatesh1

Apr 18 2024, 06:59

వైఎస్సార్ సీపీ గెలుపు చారిత్రక అవసరం.. ఆశీర్వదించండి. మీకు మంచి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ..

వైఎస్సార్ సీపీ గెలుపు చారిత్రక అవసరం.. ఆశీర్వదించండి. మీకు మంచి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ

సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరమని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ అన్నారు.

శింగనమల మండలం ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, లింగాల రమేష్ లతో కలసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చేపట్టారు.

ముందుగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కొనసాగలంటే ప్రతి ఒక్కరూ "ఫ్యాన్" గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరచాలని అభ్యర్థించారు. 

వారు మాట్లాడుతూ..జగనన్న ఐదేళ్ల పాలనలోనే అద్భుతాలు చేశారని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రధానమంత్రి ప్రశంసలే ఇందుకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్న, మరింత అభివృద్ధి జరగాలన్న జగనన్నకు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చిన దాఖలు లేవని, అయితే జగనన్న 99% హామీలను నెరవేర్చి సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసిన రానున్న ఎన్నికలలో జగనన్నను ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. టిడిపి చెబుతున్న హామీలను ప్రజలు నమ్మకపోవడంతో ఓటమి భయంతో దాడికి పాల్పడుతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 17 2024, 09:51

10000/- రూ.లు ఆర్థికసాయం చేసి ఔదార్యం చాటిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి ..

ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్ధి  కాలేజ్ ఫిజు నిమ్మితం ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి ఔదార్యం చాటినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు

ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆర్థికసమస్యలతో ఇబ్బందిపడుతున్న గోపాల్ గారి కుమారుడు కాలేజ్ ఫిజు నిమ్మితం ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు.* ఈ కార్యక్రమంలో భిమిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, సర్పంచ్ మల్లికార్జున,రామాంజినేయులు, మారుతి తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 17 2024, 06:44

గతంలో 2,50,000/-రూ.లు సొంత ఖర్చుతో త్రాగునీటి బోరు వేపించి కాలనీ వారి దాహర్తి తీర్చిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగారెడ్డి

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోనీ జనచైతన్య కాలనీ లో గతంలో 2,50,000/-రూ.లు సొంత ఖర్చుతో త్రాగునీటి బోరు వేపించి కాలనీ వారి దాహర్తి తీర్చినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు ఈ రోజు టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంకు హాజరుకావడంతో కాటప్పగారి రామలింగారెడ్డి గారిపై ప్రశంసజల్లులు కురుపించిన కాలనీవాసూలు.ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కేశవరెడ్డి గారు,నరసనాయుడు గారు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, రంగమ్మ, వలి, రఫీ, జూగును తదితరులు పాల్గొన్నారు*.

Venkatesh1

Apr 17 2024, 06:33

బుక్కరాయసముద్రం మండల పరిధిలో పలు కాలనీల నందు టిడిపి విస్తృత ప్రచారం

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జానచైతన్య కాలనీ, రామిరెడ్డి కాలనీ,గాయత్రి కాలనీ, శర్మ కాలనీ, హమాలీ కాలనీలో ఉమ్మడి MP అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ గారికి మరియు MLA అభ్యర్థి ఉమ్మడి బండారు శ్రావణి శ్రీ గారికీ మద్దతుగా ప్రచార కార్యక్రమంను నియోజకవర్గ ద్విసభ్యకమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంటిఇంటి ప్రచారం నిర్వహించారు*

ఈ కార్యక్రమంలో మాజీసర్పంచ్ లక్ష్మినారాయణ, S. నారాయణస్వామి, కేశన్న, మాజీ ఎంపీపీ SK వెంకటేష్, సాయి నాథ్ రెడ్డి,మాజీఎంపీటీసీ నారాయణస్వామి, బాబాయ్య, హరి, భూసి, చిత్తంబరి,రంగమ్మ, వలి, రఫీ తదితర మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 17 2024, 06:23

సంక్షేమంతో ప్రతి కుటుంబానికి జగనన్న చేరువయ్యారు.. జగనన్న దమ్ము, ధైర్యం ప్రజలే..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

సంక్షేమంతో ప్రతి కుటుంబానికి జగనన్న చేరువయ్యారు.. జగనన్న దమ్ము, ధైర్యం ప్రజలే..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరువయ్యారని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండలం బందార్లపల్లి, సలకంచెర్వు, ఇరువెందుల, నాయనవారిపల్లి, ఆనందరావుపేట, నిదనవాడ, రాచేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన చేపట్టారు.

పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, మాజీ ఏడిసిసి చైర్మన్ తరిమెల కోనారెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులతో కలసి చేపట్టిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామాల్లో ప్రజలు పూలమాలలు వేసి సత్కరించి, డప్పులు వాయిస్తూ డ్యాన్స్ లతో స్వాగతం పలికారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన మేలును వారికి వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల లబ్దిని వివరించారు. ఇలానే సంక్షేమ పథకాలు రావాలంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పై భౌతికదాడిని ఖండిస్తూనే మరోవైపు హేళనగా మాట్లాడటం అతడి వక్రబుద్దికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రజలకు ఏమాత్రం మంచిని చేయలేదని, జగనన్న ఒక్కరే ఇంటింటికీ మంచి చేసి అందరికి చేరువయ్యారని స్పష్టం చేశారు.

పేదరిక నిర్మూలన కోసం జగనన్న తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం మరెవరివల్లా కాదన్నారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అందిస్తున్న సాయం, మద్దతు ధరలతో రైతాంగం సంతోషంగా ఉందన్నారు. టిడిపి కేవలం తెలుగు దుష్ప్రచార పార్టీ అని చెబుతూ ఆ దుష్ప్రచారాలతోనే చంద్రబాబు జీవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగిందంటే అది జగనన్న పాలనలోనే అని, అందుకే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించుకోబోతున్నారని తెలిపారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక

మండల పరిధిలోని నాయనవారిపల్లి గ్రామంలో బెడుదూరి నాగరాజు, సరస్వతి, బాదే ప్రకాష్ టీడీపీ నుంచి వైసీపీ లోకి  చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమానికి ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 16 2024, 06:33

ప్రగతి కోసం "పల్లె నిద్ర"... ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు..

గ్రామాల్లో నెలకొన్న ప్రజాసమస్యలను గుర్తించి గ్రామాభివృద్ధికి చేపట్టవల్సిన అంశాలపై చర్చించి పల్లెల్లో ప్రగతి సాధించేందుకు "పల్లె నిద్ర" చేపడుతున్నట్లు శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.

రోజంతా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ నిత్యం జనాల్లో ఉంటూ ప్రజాదరణ పొందుతున్నారు. అలాగే నాయకులు కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహాన్ని పెంచుతూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు.

గార్లదిన్నె మండలం బుదేడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. 

గ్రామాల్లో ప్రజలతో కూర్చోని గ్రామాభివృద్ధిపై ప్రజలతో చర్చించి ఇంకా గ్రామాభివృద్ధి కోసం చేపట్టవల్సిన పనులపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విదంగా గ్రామాభివృద్ధి చేసేందుకు "పల్లె నిద్ర" కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

అనంతరం గ్రామంలో బస చేశారు.